తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, దర్శి డీఎస్పీ పర్యవేక్షణలో, అద్దంకి సీఐ సమక్షంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.ఈ ఆపరేషన్ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లు, పరిసర ప్రాంతాలను సవివరంగా తనిఖీ చేసి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా, నేర నియంత్రణ, చట్టసువ్యవస్థ పరిరక్షణకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజలు పోలీసులకు సహకరించి, ఎలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారమైనా వెంటనే తెలియజేయాలని కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే నేరరహిత సమాజం సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *