తొలి శుభోదయం ప్రకాశం:-
రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ తాళ్లూరు ఆధ్వర్యంలో అధిక ప్రయాణికుల లోడింగ్ కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, ప్రయాణికులకు నిర్ణీత సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల వాహన నియంత్రణ కోల్పోవడం, ప్రమాదాల ముప్పు పెరగడం, ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు.అలాగే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధిక లోడింగ్‌ను పూర్తిగా నివారించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని తాళ్లూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.