తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు మండలం, విక్కిరాలపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన 495 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశాను.గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఫోటో కోసం, ప్రచారం కోసం పాస్ పుస్తకాలను వాడుకుని వికృతానందం పొందారు. కానీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ అధికారిక ముద్రతో రైతులకు ఆత్మగౌరవాన్ని అందించారు.గ్రామంలోని పెండింగ్ పనులను, ముఖ్యంగా అంగన్వాడి మరియు చెక్ డ్యామ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మాటిస్తున్నాను.