తొలి శుభోదయం కందుకూరు:-
నిద్రలేస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి? అన్న ధ్యాసతోనే నేను ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి తిరుగుతున్నాను. నీలాగా కుర్చీ కోసమో, పదవి కోసమో భయపడే వ్యక్తిని నేను కాదు. ప్రజాబలంతో గెలిచిన శాసనసభ్యుడిని. నా వ్యాపారం గురించి పర్సనల్ గా మాట్లాడుతున్నావు..
మరి హైదరాబాద్ మణికొండలో నువ్వు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాల గురించి నేను మాట్లాడాలా? అక్కడ నువ్వు చేసిన ఘనకార్యాల చిట్టా, ఆధారాలతో సహా నా దగ్గర ఉంది. కానీ, నాకు సంస్కారం ఉంది కాబట్టి నీ పర్సనల్ విషయాల జోలికి నేను రాలేదు. చేతనైతే నియోజకవర్గ అభివృద్ధికి సహకరించు.. లేదా మౌనంగా ఉండు. అంతేగాని, అనవసరమైన విమర్శలు చేస్తే సహించేది లేదు. నాపై ఆరోపణలు చేయడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రా! నేను సిద్ధం. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం.