తొలి శుభోదయం కందుకూరు :-
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా, అక్కడే నివాసముంటున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్నకుమారుడు సందీప్, లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సందీప్ యోగక్షేమాలు, చదువు వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మీ నాన్న లాగే ప్రజలకు సేవ చేయాలని సందీప్ తో లోకేష్ సరదాగా ముచ్చటించారు. చక్కగా చదువుకుని, మంచి భవిష్యత్తు పొందాలని ఆకాంక్షిస్తూ లోకేష్ సందీప్ కు All the best చెప్పారు.