బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచడమన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా, ఎపిఐఐసి అధికారులు జిల్లాలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త పెట్టుబడుల ప్రోత్సాహం, మరియు యువతకు ఉద్యోగావకాశాల సృష్టి ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎపిఐఐసి ఆధ్వర్యంలో పెట్టుబడిదారులకు భూమి కేటాయింపు, అనుమతుల సమన్వయం, మరియు అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరం చేయబడుతోందని, పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సమతుల్య పారిశ్రామికాభివృద్ధి సాధించడమే ఎపిఐఐసి ప్రధాన లక్ష్యమని, పరిశ్రమల ప్రతినిధులు, MSMEలు, స్టార్టప్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆలోచనలు, పెట్టుబడి అవకాశాలు పంచుకోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, ఏ పి ఐ సి జోనల్ మేనేజర్ శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *