తొలి శుభోదయం న్యూస్ :-

ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడినాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా సింగరాయకొండకు చెందిన న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు, సన్నెబోయిన భార్గవ్ మరియు పఠాన్ రియాజ్ ఖాన్ హైకోర్టుకు హాజరై ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.న్యాయవృత్తి గౌరవం, బార్ అసోసియేషన్ బలోపేతం, న్యాయవాదుల సంక్షేమం మరియు వృత్తి ప్రమాణాల పరిరక్షణకు ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని వారుఅభిప్రాయపడ్డారు. హైకోర్టు బార్ ఎన్నికలు న్యాయవాదుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని, నూతనంగా ఎన్నికయ్యే ప్రతినిధులు న్యాయవాదుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి, వృత్తి అభివృద్ధికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే ఈ ఎన్నికలు రాష్ట్ర న్యాయవాదుల ఐక్యతను మరింత బలపరిచే దిశగా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *