తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో సమావేశమై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ — ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేయకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చట్టవిరుద్ధ చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని హెచ్చరించారు.డ్రైవర్లు మర్యాదపూర్వకంగా ప్రయాణికులతో ప్రవర్తించాలని, వాహన పత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటివి ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.