తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ RSI శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా హెల్మెట్/సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.అలాగే ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్ల బాధ్యత ఎంతో ముఖ్యమని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని RSI శివ ప్రసాద్ హెచ్చరించారు. ప్రతి ఆటో డ్రైవర్ రోడ్డు భద్రతకు దోహదపడేలా రోడ్ సేఫ్టీ అంబాసిడర్‌గా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *