తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ‘శక్తి యాప్’ ఒక డిజిటల్ రక్షణ కవచంలా పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా యాప్‌లో ఉన్న SOS అలర్ట్ ఫీచర్ ద్వారా తక్షణమే పోలీస్ సహాయం ఎలా పొందవచ్చో మహిళలు మరియు విద్యార్థినులకు ప్రత్యక్షంగా వివరించారు.ప్రతి మహిళా తన మొబైల్ ఫోన్‌లో ‘శక్తి యాప్’ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితి ఎదురైనా వెనుకాడకుండా యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. మహిళల భద్రతే పోలీస్ శాఖ యొక్క ప్రథమ కర్తవ్యమని అధికారులు స్పష్టం చేశారు.అదేవిధంగా, సమాజంలో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, మహిళల భద్రతకు సంబంధించిన విషయాల్లో వెంటనే స్పందించాలని పోలీసుల తరఫున విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో భద్రతపై నమ్మకం పెంపొందడంతో పాటు, అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించే విధానంపై స్పష్టత కలిగిందని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *