మండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు.
తొలి శుభోదయం కందుకూరు:-
అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగినది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు పండిత్ సంపత్ కుమార్,న్యాయవాది ముప్పవరపు. కిషోర్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా అవసరమైన ఆరోగ్య సేవలను పొందగలిగేలా బలమైన మరియు స్థితిస్థాపకమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించాలని శుక్రవార0 అంతర్జాతీయంగా ఏర్పాటు చేయడం జరిగినది అని అన్నారు. అందరూ ఆరోగ్యం పొందే విధంగా ప్రోత్సహిస్తుంది, ఆరోగ్య సేవలు పొందే హక్కు ప్రజలందరికి కల్పించిందని అన్నారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించుటకు అనుమతి కల్పించిన కందుకూరు ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఇంద్రాణి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సిబ్బంది తో పాటు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.