తొలి శుభోదయం రాజోలు:-
దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా అంబేడ్కర్ బుక్ లెట్లను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం సెక్రటేరియట్ లోని సాంఘిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యాలయంలో ఇంటింటా అంబేడ్కర్ కార్యక్రమ బుక్ లెట్లను మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అవిష్కరించారన్నారు. ఇంటింటా అంబేడ్కర్ కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్న దళిత చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడారని దళిత చైతన్య వేదిక నాయకులు తెలిపారు. అనంతరం మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించినట్లు వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వేదిక పూర్వపు అధ్యక్షులు సరేళ్ళ సురేష్ బాబు, ముస్కుడి బాలాజీ, నామవరపు చిన సత్యనారాయణ, తాడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.