*ఆత్మవిశ్వాసం ఉన్నచోటే భవిష్యత్తు మెరుగవుతుంది – హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు*
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 220 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. దాని లో భాగంగా సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలకు చెందిన ఎంపికైన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1000 చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు.ఉల్లాస్ ట్రస్ట్ తరఫున డెలివరీ మేనేజర్ దింటకుర్తి బాలకృష్ణ విద్యార్థులకు ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల విజయగాధలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ —
“డ్రెస్ వెల్, స్పీక్ వెల్, బిహేవ్ వెల్” అనే సూత్రాలను ప్రతి విద్యార్థి జీవితంలో పాటించాలి. చక్కని వేషధారణ మనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది, సరళమైన భాషతో మృదువుగా మాట్లాడడం స్నేహాన్ని పెంచుతుంది, సత్ప్రవర్తన మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది,” అని అన్నారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. మహాలక్ష్మి, ఉపాధ్యాయులు వీరమ్మ, దింటకుర్తి శిరీష, సుధాకర్, పి. కోటేశ్వరరావు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.