తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్,త్రో బాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం, స్ఫూర్తి, స్నేహబావం పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు చదువుకే పరిమితం కాకుండా క్రీడలలో కూడా చురుకుగా పాల్గొనడం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ పోటీలలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి పలువురు ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినిలు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మహిళలత్రోబాల్ జట్టుకు 9మంది ఉపాధ్యాయినిలు,క్రికెట్ జట్టకు 16మందిని ఎంపిక చేశారు.మండలం స్థాయి లో ఎంపికైన పై రెండు జట్లు డిసెంబర్ 12,13 తేదీలలో ఒంగోలు నందు డివిజన్ స్థాయి లో ఆడతారని ఎం.ఈ.ఓ తెలిపారు.గెలుపొందిన జట్టుకు కెప్టెన్ జలకం ప్రభాకర్, వైస్ కెప్టెన్ అర్రిబోయిన రాంబాబు కాగా బెస్ట్ కీపర్ అంబటి బ్రహ్మయ్య, బెస్ట్ క్యాచ్ అన్వర్, బెస్ట్ బ్యాట్స్మెన్ రాంబాబు,చంద్రశేఖర్, మ్యాచ్ కు ఎంపైర్ గా పంతగాని వెంకటేశ్వర్లు వ్యవరించారు.
