తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారి–16పై సూరారెడ్డిపాలెం (IOC) ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తనిఖీలు చేపట్టి, అధిక వేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం వంటి అంశాలపై చర్యలు తీసుకున్నారు. అలాగే వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.