తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడు పాలెం :-
సింగరాయకొండ జాతీయ రహదారిపై కలికివాయి ప్లైవోవర్ వద్ద నుంచి కనుమళ్ల రోడ్డు వరకూ 3.6 కి.మీ మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ మరొక చోటకు మార్చాలని కోరుతూ మూలగుంట పాడు, సింగరాయకొండ, కనుమళ్ల, కలికి వాయి గ్రామస్థులు ఆదివారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలసి వినతి పత్రం అందజేశారు. రన్ వే వలన సింగరాయకొండ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని నాలుగు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే రన్ వే ను మరోచోటకు తరలించాలని వారు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు.