తొలి శుభోదయం :-
మార్కాపురం జిల్లా ప్రకటనతో గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నారు. శనివారం ఉదయం స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ని నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. మార్కాపురం జిల్లా సాధనలో ముత్తుముల అశోక్ రెడ్డి ఎంతో కృషిచేశారనివెనుకబడినగిద్దలూరును అభివృద్ధి చేయటమే ఎమ్మెల్యే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు, కొమరోలు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, బోనేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎడ్యుకేషన్ & సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గోనా చెన్నకేశవులు, కంభం జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లె శ్రీనివాసులు, మరియు కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు, మండలాల నాయకులు పాల్గోన్నారు..