తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

టంగుటూరులోని RISE కాలేజీలో నిర్వహించిన ఏపీపీఎస్సీ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా స్కై ఐ – ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్ నిఘాను వినియోగించారు.ఈ భద్రతా ఏర్పాట్లను సింగరాయకొండ సిఐ ,టంగుటూరు ఎస్ఐ పర్యవేక్షణలో అమలు చేశారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అనుమానాస్పద కదలికలపై డ్రోన్ ద్వారా నిరంతర నిఘా కొనసాగించారు. దీనివల్ల అనధికార వ్యక్తుల ప్రవేశం, మాల్ ప్రాక్టీస్, గుంపులుగా చేరడం వంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు.పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బందిని మోహరించి అభ్యర్థుల రాకపోకలను క్రమబద్ధంగా నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయి.పోటీ పరీక్షల సమయంలో పారదర్శకత, భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *