తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కార్మిక వర్గంపై ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అనాగరిక దాడికి నిరసనగా ఏప్రిల్ ఒకటి” బ్లాక్ డే “గా పాటించాలని, నాలుగు లేబర్ కోడ్ లు అమలుకు వ్యతిరేకంగా సంఘటి త పోరాటాలకు సిద్ధం కావాలని ఐయఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్,మోహన్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యవర్గం,కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్ మోహన్ మాట్లాడుతూ విదేశీ బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల నే దురించి తమ రక్త తర్పణలతో
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను స్వదేశీ మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వం రద్దుచేసింది, వాటి స్థానంలో కార్మికులను కట్టు బానిసలుగా చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని కామ్రేడ్ ఆర్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ నాలుగు లేబర్ కోర్టులో 1926లో అంటే 100 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాట సహించుకున్న ట్రేడ్ యూనియన్ యాక్ట్ రద్దు చేశారు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాలను రద్దు చేశారు, ఆటో,రవాణా రంగ కార్మికులకు ఉరి తాళ్లు బిగిస్తూ “హిట్ అండ్ రన్ యాక్ట్ ‘సవరించారని, కార్మికులు 150 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8గంటల పని దినాన్ని 12,14 గంటలకు పెంచారని, అందువలన కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, రద్దు చేసిన పాత 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించి అమలు చేయాలని ఐయఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్,మోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే నాంచార్లు,ఐయఫ్ టి యు గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ డొక్కా కోటేశ్వరావు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే బాబులు, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కామ్రేడ్ సిహెచ్,సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *