తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం పొదిలి రోడ్లోని సేయింట్ జేవియర్స్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు. ఫాస్టర్ బాల సౌరీ గారితో కలిసి ప్రార్థనలు చేశారు.క్రైస్తవ సోదరులు నిర్వహించిన సిలువ యాత్ర (Way of the Cross) లో పాల్గొని, భుజంపై సిలువను మోసి తన భక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ —
యేసుక్రీస్తు చేసిన అపారమైన త్యాగం మానవాళికి మార్గదర్శకమని, ప్రేమ, శాంతి, క్షమ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
క్రీస్తు చూపిన ప్రేమ మార్గమే నిజమైన జీవన మార్గమని, తోటివారిపట్ల దయతో మెలగడమే దేవునికి చేసే గొప్ప సేవ అని పేర్కొన్నారు.నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, విశ్వాసులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.