తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన ఆర్ఎస్ఐ శివప్రసాద్ పర్యవేక్షణలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై అనధికారికంగా నిలబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఆటో డ్రైవర్లపై జరిమానాలు విధించారు.తరువాత ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచనలు ఇచ్చారు. నియమిత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు అందజేశారు.ప్రజా రవాణా సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.