తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ని ఓడ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ . జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సింగరాయకొండ మండలంలో రాబోవు గ్రామపంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని షేక్ రియాజ్ సూచించడం జరిగింది. అదే విధంగా జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతి గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం మౌలిక వసతులపై జనసేన పార్టీ దృష్టి పెట్టాలని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే నా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగినది. అదేవిధంగా సింగరాయకొండ మండలంలో ఎక్కడైనా అక్రమ లేఔట్ లో వేసి ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగినది.