ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో Women Shakthi Mobile App డౌన్‌లోడ్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు బస్టాండ్‌లో ప్రయాణిస్తున్న మహిళలకు శక్తి యాప్ ముఖ్యత, అత్యవసర పరిస్థితుల్లో అది ఎలా సహాయపడుతుందనే అంశాలపై వివరణ ఇచ్చారు. యాప్‌లోని SOS బటన్, లొకేషన్ షేరింగ్, పోలీస్ రెస్క్యూ టీమ్‌కు నేరుగా సంబంధించిన సదుపాయాల గురించి ప్రజలకు వివరించారు.మహిళలు తమ మొబైల్ ఫోన్లలో వెంటనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకునేలా పోలీసులు సహాయం చేశారు. మహిళల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *