తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సిఐ జగదీష్ పర్యవేక్షణలో ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు డ్రైవ్ ను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివ ప్రసాద్ సిబ్బందితో కలిసి రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలను తొలగించారు.అదేవిధంగా దుకాణదారులు మరియు ప్రజలకు రహదారులను ఆక్రమించవద్దని, ట్రాఫిక్ క్రమశిక్షణ పాటించాలని అవగాహన కల్పించారు. ఎంఎమ్ రోడ్ మీద ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ప్రజల సౌకర్యం కోసం ఇటువంటి ఆక్రమణ తొలగింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *