తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, కర్నూలు రోడ్డులో ట్రాఫిక్కు ఆటంకం కలిగించే అక్రమ పార్కింగ్, రోడ్డు మార్జిన్లపై వస్తువులు ఉంచడం, వాహనాలను మార్గమధ్యంలో నిలిపివేయడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ ప్రవాహాన్ని భంగం కలిగిస్తున్న వాహనాలు, వ్యాపారులు మరియు ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు విధించారు. రహదారులు ఎల్లప్పుడూ క్లియర్గా ఉండేలా ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు నియమాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.