తొలి సుభదయం ప్రకాశం:-
నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యలను పరిశీలించేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఒంగోలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో సమావేశమై, ట్రాఫిక్ నియమనిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, జంక్షన్ల వద్ద క్రమబద్ధమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. ప్రజల సౌకర్యం, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని ఆదేశించారు.అలాగే పీక్ అవర్స్‌లో వాహనాల రద్దీ తగ్గించే చర్యలు తీసుకోవాలని, సిగ్నల్స్ సమయ నియంత్రణను పునఃపరిశీలించి అవసరమైతే సర్దుబాటు చేయాలని తెలిపారు. సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ, మరింత ప్రజాభిముఖంగా వ్యవహరించాలన్నారు.డీఎస్పీ గారు ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమ భద్రతకే కాకుండా సమాజ భద్రతకూ సహకరించాలని పిలుపునిచ్చారు.