తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట పర్యవేక్షణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.జిల్లాలో నేరాలను అరికట్టటం, అక్రమ రవాణాలు, అనుమానితుల కదలికలను పర్యవేక్షించడం, రోడ్డుప్రమాదాల నివారణ, అలాగే రాత్రి వేళల్లో ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టారు.డీఎస్పీ స్వయంగా నైట్ మానిటరింగ్ నిర్వహిస్తూ, చెక్‌పోస్టులు, పట్టణ పరిసర ప్రాంతాలు, హైవేలు, సున్నితమైన ప్రాంతాలను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు అందించారు. రాత్రి పూట విధుల్లో నిర్లక్ష్యం లేకుండా, ప్రతి వాహనాన్ని శ్రద్ధగా తనిఖీ చేయాలని, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు.ఈ ప్రత్యేక నైట్ డ్రైవ్ ద్వారా పలువురు అనుమానిత వాహనాలు తనిఖీ చేయబడగా, ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోగా, అవసరమైన చోట పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి డ్రైవ్‌లు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు.ప్రజలు అనుమానస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.