ప్రజల సమస్యలు తెలుసుకొని, వారి నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
తొలి శుభోదయం ఒంగోలు:-
ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రజా ధర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే కి తెలియజేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రుణాల మంజూరు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు, గ్రామాభివృద్ధికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన విజ్ఞప్తులను ఎమ్మెల్యే గారు స్వయంగా స్వీకరించి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను పిలిచి ప్రత్యక్షంగా ఆదేశాలు జారీ చేసి, ప్రజలకు త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకున్నారు.
