తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని పెర్నమీట్ట ప్రాంతంలో స్థానికులకు సమస్యగా మారిన ఓపెన్ బూసింగ్ ప్రాంతాలను పూర్తిగా తొలగించేందుకు తాలూకా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.తాలూకా సీఐ విజయకృష్ణ పర్యవేక్షణలో, తాలూకా ఎస్సై హరీబాబు నాయకత్వంలో, పోలీసు సిబ్బంది, స్థానిక మున్సిపల్ సిబ్బంది కలిసి శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ పేరుకుపోయిన చెత్త, మలినాలను JCB సహాయంతో పూర్తిగా శుభ్రపరిచారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యహిత వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలు, యాంటీ–సోషల్ మూమెంట్స్‌పై కూడా నియంత్రణ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.తాలూకా సీఐ విజయకృష్ణ మాట్లాడుతూ—పెర్నమీట్ట ప్రాంత ప్రజలకు భద్రత, శుభ్రత రెండూ కూడా పోలీసులు సమాన ప్రాధాన్యంతో చూస్తున్నామన్నారు. ఇలాంటి ఓపెన్ బూసింగ్ పాయింట్లు ప్రజలకు అసౌకర్యాన్ని, వ్యాధులను కలిగించే ప్రమాదం ఉన్నందున, వాటిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.తాలూకా ఎస్సై హరీబాబు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ—
ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని, ఇలాంటి అనారోగ్యకర ప్రాంతాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసులు సమాజంలో పరిశుభ్రత, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించనున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *