తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుని శనివారం వేరువేరుగా కలిసి ఘనంగా సత్కరించారు. నెల్లూరు జిల్లాలో చేర్చబడ్డ కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు ప్రశంసించారు.గత ప్రభుత్వంలో కందుకూరు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చిన విషయాన్ని ప్రజలు మరువలేరని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అప్పట్లో 55 రోజులపాటు వివిధ ఆందోళనలు జరిగినప్పటికీ, వారి మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.అయితే, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ సభ్యులు గుర్తుచేశారు. అలాగే ‘యువగళం’ పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ ని కలిసిన ఇంటూరి ప్రజల తరఫున సమస్యను వివరించి తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చే హామీ తెచ్చిన విషయాన్ని నాయకులు ప్రశంసించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ , మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రజల అభీష్టం మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కందుకూరు ప్రజల సమస్యను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పట్టుదలతో కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారే ఈ విజయంలో ప్రధాన పాత్రధారి అని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, రెబ్బవరపు మాల్యాద్రి, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ సలాం, మురారిశెట్టి వెంకటసుధీర్, మోదడుగు వెంకటేశ్వర్లు, కొత్తూరు వెంకట సుధాకర్, కాకుమాని ప్రవీణ్, మంచిరాజు మురళి, నందనవనం రాము, చుండూరి శ్రీను, ముచ్చు వేణు, మేడ మల్లికార్జున, షేక్ రూబీ, గుమ్మ శివ, రావూరి రామకోటయ్య, మరియు పట్టణంలోని అన్ని వార్డు అధ్యక్షులు ప్రజలు జేఏసీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *