2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు , దామాచర్ల సత్య తదితరులు
కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సందడే సందడి
భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు
తొలి శుభోదయం కందుకూరు:-
ఈనెల 14, 15 తేదీలలో సింగరాయకొండ మండలం పాకల వద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న సందర్భంగా… ఆ కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కందుకూరు పట్టణంలో మంగళవారం 2k రన్ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జెడ్పి సీఈవో చిరంజీవి, సబ్ కలెక్టర్ హిమవంశీ, డీఎస్పీ బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, ఎంపీడీవో రత్నజ్యోతి తో సహా అనేకమంది అధికారులు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు… ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ సందడి చేశారు. కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మన కందుకూరుకు దగ్గరలోని పాకల వద్ద ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బీచ్ ఫెస్టివల్ లో అందరూ పాల్గొనాలని, కుటుంబ సభ్యులతో తరలివచ్చి సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వినోదం, ఉల్లాసం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నిత్యం ఒత్తిడితో, ఉరుకులు పరుగులతో జీవనం సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… బీచ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు.మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించబోయే బీచ్ ఫెస్టివల్ లో అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బీచ్ అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఇంకా ఇతర నాయకుల సహకారంతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, కందుకూరు చుట్టుపక్కల ప్రజలంతా ఈ వేడుకల్లో పాలుపంచుకోవాలని దామచర్ల సత్య ఆహ్వానించారు.అలాగే యువ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సారధ్యంలో కందుకూరు నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందని సత్య చెప్పారు. లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు. కందుకూరు ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తుందని దామచర్ల సత్య పేర్కొన్నారు.అంతకుముందు కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ వద్ద, సభా వేదికపై నాయకులు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, కూటమి పార్టీ నేతలు అధికారులు,ఈవెంట్స్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
