తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్, 4వ మరియు 32వ వార్డులలో “ఎన్టీఆర్ భరోసా” పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.అవ్వాతాతల ముఖాల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ & నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ బీద రవిచంద్ర , నెల్లూరు జిల్లా కలెక్టర్ రాజబాబు మరియు కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ తో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాము.ప్రజల వద్దకే పాలన అనే మాటకు నిలువుటద్దంగా, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా వారి గడప వద్దకే చేర్చాము.