తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద నిన్న సాయంత్రం గద్దె సువార్తమ్మకు ఒక బంగారు గొలుసు దొరికింది. ఆమె నిజాయితీగా మంగళవారం ఆ గొలుసును పట్టణ ఎస్సై శివ నాగరాజుకు అప్పగించారు. సువార్తమ్మ నిజాయితీని అభినందించిన ఎస్సై, ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజానికి ఆదర్శమని అన్నారు. అదే సమయంలో గొలుసు పోగొట్టుకున్న వారు వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.