తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు ఏరియా ఆసుపత్రికి నూతనంగా నియమింపబడిన సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణిని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వశ్రీ గడ్డం మాలకొండయ్య మువ్వల భూషయ్య శిఖా తిరుపాలులు మర్యాద పూర్వకంగా కలసి శుభాభినందనలు తెలిపారు. ఈ నెలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరుగు అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై సూపరింటెండెంట్ గారితో చర్చించడం, ఆసుపత్రి అభివృద్ధి కోసం, రోగుల మరియు వారి సహాయకుల కోసం తీసుకోవలసిన వసతుల నిమిత్తం చర్చించడం జరిగినది.