తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు ఏరియా వైద్యశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి జాతీయ జెండానుఆవిష్కరించారు . అనంతరం జాతీయ గీతం ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఇంద్రాణి ప్రసంగిస్తూ, భారత రాజ్యాంగం దేశానికి అందించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి వివరించారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని, ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్న వారు సేవా భావంతో, మానవతా దృక్పథంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఆమె తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులు పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఆరోగ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయని పేర్కొంటూ, రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించడం, అత్యవసర పరిస్థితుల్లో సమయపాలన పాటించడం అత్యంత అవసరమని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *