తొలి శుభోదయం కందుకూరు:-

శ్రీకాకుళం జిల్లా తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో కందుకూరు పట్టణం సంతోష్ నగర్‌కు చెందిన షేక్ అలీమ్ (M.Tech) తన అద్భుత ప్రతిభతో సెకండ్ విన్నర్‌గా నిలిచి కందుకూరుకు గర్వకారణంగా మారాడు.నిరంతర సాధన, క్రమశిక్షణతో బాడీ బిల్డింగ్‌లో ముందుకు సాగుతున్న అలీమ్‌కు ఆయన తండ్రి షేక్ కరిముల్లా (డిష్ భాషాగా గుర్తింపు పొందిన వారు) అందిస్తున్న సంపూర్ణ సహకారం, ప్రోత్సాహమే ఈ విజయానికి బలమైన ఆధారం అని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.తండ్రి ఆశీస్సులు, కుటుంబ సభ్యుల అండతో అలీమ్ ఈ స్థాయికి చేరుకున్నారు.ఈ సందర్భంగా షేక్ అలీమ్ మాట్లాడుతూ,“మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సెకండ్ విన్నర్‌గా నిలవడం నాకు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ విజయం వెనుక నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ముఖ్యంగా నాన్న షేక్ కరిముల్లా నిరంతర సపోర్ట్ ఉంది. ప్రతి రోజు కఠినంగా శ్రమిస్తూ, క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మరింత కష్టపడి గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్య సాధన.నా విజయాలతో కందుకూరు పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెడతాను. నన్ను ప్రోత్సహించిన గురువులు, మిత్రులు, కందుకూరు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.క్రీడలతో పాటు ఉన్నత విద్యను సమన్వయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న షేక్ అలీమ్‌ను ప్రజలు అభిమానంగా ‘కందుకూరు ఐరన్ మ్యాన్’ గా పిలుచుకుంటున్నారు. అలీమ్ సాధించిన ఈ విజయం కేవలం వ్యక్తిగత ఘనత మాత్రమే కాకుండా, మొత్తం కందుకూరుకు గర్వకారణంగా నిలుస్తోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *