తొలి శుభోదయం కందుకూరు:-
మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీ ఆదివారం కందుకూరు పట్టణంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ప్రముఖ కంటి హాస్పిటల్…. గుంటూరు పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో… డాక్టర్లు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని, పెదకాకాని ఆసుపత్రికి తీసుకువెళ్లి కంటి ఆపరేషన్లు చేయిస్తారు. కావున కంటి జబ్బులతో బాధపడేవారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.