తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా ఓగూరు గ్రామానికి చెందిన రాయపాటి సుభాషిణి గారిని ప్రభుత్వం నియమించడం ఆనందంగా ఉంది. వైస్ చైర్మన్‌గా చేవూరు గ్రామానికి చెందిన శ్రీ పొట్టేళ్ల మురళి నియమితులయ్యారు.ఈ సందర్భంగా సుభాషిణి , మురళి నన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేసి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు అందజేశాను.కందుకూరు చరిత్రలో తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించడం జరిగింది. పార్టీలో కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందనే నమ్మకానికి ఇది నిదర్శనం.మార్కెట్ కమిటీ ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాం. ముఖ్యంగా రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకుని పని చేస్తూ, ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *