తొలి శుభోదయం కందుకూరు:-
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు హోంగార్డులను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఘనంగా సత్కరించారు. కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ విధులలో ఉత్తమ సేవలు అందించిన షేక్ నజీర్ హుస్సేన్, ఎదురూరి చెన్నకేశవాచారి లను జిల్లా ఎస్పీ సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కందుకూరు పోలీస్ అధికారుల తోపాటు పట్టణ ప్రజలు నజీర్, చెన్నకేశవాచారి లను అభినందించారు.