తొలి శుభోదయం న్యూస్ కంభం:-

జిల్లా sp ఆదేశాల మేరకు కంభం si శివరామ కృష్ణ రెడ్డి పరిధిలోని NH-544D రహదారిపై ట్రావెల్స్ బస్సులు మరియు వాహనాలలో అమర్చిన అనధికార LED లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ డ్రైవ్ సందర్భంగా వాహనాలను సమగ్రంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన LED లైట్లను అక్కడికక్కడే తొలగించి ధ్వంసం చేశారు.
అధికారులు డ్రైవర్లకు ట్రాఫిక్ మరియు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనే సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక కాంతి వెలువరించే లైట్ల వినియోగాన్ని నివారించాలని హెచ్చరించారు.
ఈ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు రహదారి భద్రతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *