తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పట్టణంలోని ఒక హాస్టల్‌ను వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం భద్రత, అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘శక్తి యాప్’ గురించి వివరంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాప్‌లోని ముఖ్య ఫీచర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలి, వెంటనే పోలీస్ రెస్పాన్స్ ఎలా లభిస్తుంది వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు.మహిళలు, బాలికలు ఏ విధమైన ఇబ్బంది లేదా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా వెంటనే శక్తి యాప్ ద్వారా సహాయం పొందగలరని, ఈ యాప్‌ను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్‌ఐ సూచించారు.ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *