తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో కనిగిరి సీఐ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ పి.సి. పల్లి, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు సూచించారు.అలాగే ఈ సందర్భంగా ప్రజలతో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఇలాంటి రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *