తొలి శుభోదయం ప్రకాశం:-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు నేరాల నియంత్రణ, కేసుల వేగవంతమైన పరిష్కారం లక్ష్యంగా కనిగిరి SDPO కార్యాలయంలో కనిగిరి డీఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కనిగిరి మరియు పామూరు సర్కిళ్లకు చెందిన సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు.సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన UI CD ఫైళ్లు మరియు PT CD ఫైళ్లను సవివరంగా పరిశీలించి, పెండింగ్ కేసుల పురోగతిపై చర్చించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచడం, ఆధారాల సేకరణలో జాగ్రత్తలు పాటించడం, కోర్టుల్లో కేసుల పరిష్కార శాతం మెరుగుపరచడంపై డీఎస్పీ సర్ కీలక సూచనలు చేశారు.అలాగే నేరాల నివారణకు ముందస్తు చర్యలు, బీట్ వ్యవస్థ బలోపేతం, ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంచుతూ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఎస్సై తన పరిధిలోని కేసులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో H.M. పాడు పోలీస్ స్టేషన్ ఎస్సై కూడా పాల్గొని, తమ పరిధిలోని నేర పరిస్థితులు మరియు తీసుకుంటున్న చర్యలను వివరించారు.ప్రజల భద్రతే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *