తొలి శుభోదయం ప్రకాశం:-

కానిస్టేబుళ్ల శిక్షణకు ఆధునిక సౌకర్యాలతో నవీకరించిన ఒంగోలు కొత్త మామిడిపాలెంలో ఉన్న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DPTC) ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. పోలీస్ శాఖకు వెన్నుముక్కలైన కానిస్టేబుళ్లకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా హోంమంత్రి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత తో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పీటీసీ ప్రిన్సిపాల్ శ్రీమతి జి.ఆర్. రాధిక, ఐపీఎస్., ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ (అడ్మిన్) శ్రీమతి కె.జి.వి. సరిత, ఐపీఎస్., పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (DPTC)లో SCTPCs (సివిల్)–2025 బ్యాచ్‌కు సంబంధించిన ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఎంపికైన 193 మంది అభ్యర్థులకు 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి మాట్లాడుతూ, పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల పట్ల బాధ్యత అత్యంత ముఖ్యమని తెలిపారు. శిక్షణ దశ నుంచే విలువలతో కూడిన వృత్తి నైపుణ్యాలు అలవర్చుకుంటే, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలపై పూర్తి అవగాహన, శారీరక దృఢత్వం పోలీస్ ఉద్యోగులకు తప్పనిసరి అని పేర్కొన్నారు.తదనంతరం మంత్రిలు, యంపీ గార్లు మరియు పోలీస్ అధికారులు ట్రైనింగ్ సెంటర్‌లోని బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్, శారీరక శిక్షణ విభాగాలు, భోజనశాల తదితర మౌలిక వసతులను పరిశీలించటంతోపాటు, ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతగా మంత్రులు, అధికారులు ట్రైనింగ్ సెంటర్ పరిసరాల్లో మొక్కలు నాటారు. ఆధునిక శిక్షణతో పాటు క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన పోలీస్ సిబ్బంది తయారయ్యే దిశగా ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.ఈ కార్యక్రమంలో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి. రమణ కుమార్, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐలు మరియు ఎస్సైలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *