తొలి శుభోదయం కామేపల్లి:-
కామేపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ అమ్మవారి ఆలయం శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయ చైర్మన్ కామేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పోటు శ్రీనివాస మురళి బాబు( పెదబాబు)ను నియమిస్తూ దేవాదాయ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా పోటు పెదబాబు మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ఆలయ చైర్మన్ గా తనను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మంత్రి బాలశ్రీ వీరాంజనేయ స్వామికి, మారీ టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పెదబాబు ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి గ్రామస్తుల భక్తుల సహకారంతో తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పెదబాబు తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పెదబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.