సింగరాయకొండ, తొలి శుభోదయం:
గ్రామాల్లో స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ వాతావరణం, సంపూర్ణ పారిశుధ్యం సాధించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీలకు సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, లోటస్ స్కూల్ విద్యార్థులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికుల సత్కార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, “గ్రామ పరిశుభ్రత అందరి బాధ్యత. తడి, పొడి చెత్తను వేరు చేయాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలి. నెలలో ఒకరోజు వాహన రహిత దినోత్సవం పాటించాలి,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావు, మండల అభివృద్ధి అధికారి జయమణి, తహసీల్దార్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు