తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ (Annual Inspection) నిర్వహించిన దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ , త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో ఈ తనిఖీ జరిగింది.ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లు, ఆయుధాల నిర్వహణ, స్టేషన్ శుభ్రత, స్టాఫ్ పనితీరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, విచారణ వేగవంతం చేయాలని సూచనలు అందించారు.

పోలీస్ స్టేషన్ పని తీరు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండాలని,
చట్టం అమలులో పారదర్శకత, క్రమశిక్షణ, స్పందన ముఖ్యమని,
ప్రజలతో సానుకూల సంబంధాలు కొనసాగించాలని సూచించారు.స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని అధికారులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *