తొలి శుభోదయం కందుకూరు :-

ధాన్యం, పత్తి, మొక్కజొన్న, అరటి, తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని, భూమిలేని కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కందుకూరు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ దామెర హిమ వంశీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6 కొట్ల 70లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో విఫలమవుతుందన్నారు. తేమ శాతం పేరుతోనూ, ధాన్యం రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వడం లేదు అని, కొనుగోలు కేంద్రం, రైతు సేవ కేంద్రం, రవాణా ఇన్ చార్జిలు, కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్స్ కుమ్మక్కైధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నరన్నారని ఆరోపించారు. దీంతో 75 కేజీల బస్తాను రూ.1200 అమ్ముకొని బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నారన్నారు. ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు విషయంలో పీ యం యాప్, సీం యాప్ ల పేరుతో అనేక ఇబ్బందులు పెడుతున్నారు అని, రాష్ట్రంలో 2.50 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగిందన్నారు. సుమారు 13లక్షల దిగుబడి వస్తుదని అధికారుల అంచనా వేసి మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉన్నప్పటికీ వ్యాపారులు మార్కెట్లో రూ.1600 నుంచి 1700 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు చేయడానికి ఇంతవరకు కేంద్రాలే ఏర్పాటు చేయలేదు అని, ఈ ఏడాది 11.20 లక్షల ఎకరాల్లో పత్తి పండించారన్నారు. ఖరీఫ్ ప్రారంభం నుండే పత్తి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారనీ, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు వల్ల 3 లేక 4 క్వింటాళ్ళుకు మించి దిగుబడి రాలేదని, వచ్చిన దిగుబడి కూడా రంగు మారడంతో నాణ్యత లేదని సీసీఐ కొనుగోలు కేంద్రాలు అనేక కొర్రీలు పెట్టి ప్రైవేటు వ్యారస్తులుకు అమ్ముకునే విధంగా వ్యవహారించడం బాధాకరమన్నారు. కొనుగోలు నిబంధనలు సడలించి ధాన్యం, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకే కొనుగోలు చేస్తామని , అరటి రైతులకు న్యాయం చేస్తామని, ఉల్లి పంట రైతులకు హెక్టారకు రూ.50వేలు ఇస్తామని, భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని అనేక వాగ్దానాలు చేశారనీ, వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాను వలన రూ.5500 కోట్లు పైగా నష్టం జరిగితే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.1000 కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది అని, ఎన్యూమరేషన్ పూర్తి చేసి నెల రోజులైన రైతాంగానికి నష్ట పరిహారం అందించలేదు.కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేసి స్వచ్ఛంద పంటల భీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో భీమా ప్రీమియం భారంగా ఉండటం వలన ఎక్కువ మంది రైతులు బీమా పథకంలో చేరలేక పోయారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయిందన్నారు. నిబంధనలు సడలించి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను
మద్దతు ధరలకు అదనంగా రాష్ట్రప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలి అని, భూమి లేని కౌలురైతులందరికి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు, వ్యవసాయ, ఉద్యాన తదితర అన్నిరకాల పథకాలు అమలు చేయాలి అని, మార్కెట్ లో ధరలు పడిపోయి నష్ట పోతున్న అరటి, నిమ్మ,బత్తాయి రైతులను ఆదుకోవాలి అని, మొంథా తుపాను, ఆధిక వర్షాలు,వరదలు, కరువు వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు, కౌలురైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించాలి అని, రబీ పంట కాలంలో సాగు చేసిన పంటలన్నిటికి ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి అని, కేంద్ర ప్రభుత్వం ఒక పర్యాయము వ్యవసాయ రుణాలు అన్నిటిని మాఫీ చేసి రైతులను, కౌలురైతులను ఆదుకోవాలి అని, వ్యవసాయ అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి అని, స్వదేశీ రైతాంగానికి నష్టం చేసే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై గతంలో ఉన్న సుంకాలను పునరుద్ధరించాలి అని, దేశం నుండి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేయించాలి అని, రైతు వ్యతిరేక విద్యుత్ బిల్లు, సీడ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి అని, రొయ్యలు, చేపలకు కూడా మద్దతు ధరల ప్రకటించి ఆక్వా రైతుల నష్టపోకుండా చర్యలు చేపట్టాలి అని, సీడ్ కు, ఫీడ్ కు, విద్యుత్తుకు సబ్సిడీ అందించాలి అని 10 రకాల డిమాండ్ లను నెరవేర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోవాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఆనందమోహన్, ఉప్పుటూరి మాధవరావు, చేవూరు దుర్గాప్రసాద్, బొల్లోజుల బాల బ్రహ్మచారి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *