తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, కొండపి సీఐ శ్రీ సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ప్రదేశాలను పరిశీలించి, ఆ ప్రాంతాల్లో ఉన్న చెత్త, గాజు సీసాలు మరియు మద్యం వ్యర్థాలను పూర్తిగా శుభ్రపరిచారు. ప్రజలు భయభ్రాంతులు లేకుండా సురక్షితంగా సంచరించేలా పోలీస్ బృందం చర్యలు చేపట్టింది.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనాన్ని అస్సలు ఉపేక్షించబోమని,
ప్రజల శాంతి భద్రత కోసం ఇటువంటి శుభ్రత మరియు అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగుతాయని తెలిపారు.సమాజంలో శుభ్రత, భద్రత, శాంతియుత వాతావరణం నెలకొల్పడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *