తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ అధికారులు స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, రికార్డులు తదితరాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సిఐ సోమశేఖర్ రికార్డుల నిర్వహణ, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వ్యవహారాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.పోలీస్ సిబ్బంది ప్రజలకు అందించే సేవలకు మరింత ప్రతిష్టను చేకూర్చే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.కేసుల త్వరితగతిన పరిష్కారం, రికార్డుల ప్రమాణబద్ధ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తారని తెలిపారు.